By: Oneindia Telugu Video Team
Published : November 10, 2017, 08:58

దిన ఫలాలు 10- 11- 2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 10 వ తేదీ శుక్రవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం.. బహుళ సప్తమి రాత్రి 7 గంటల 49 నిమిషముల వరకు వుంది. పుష్యమి నక్షత్రం సాయంత్రం 5 గంటల 54 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం లేదు , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి లగ్నాధిపతి సష్టమం లోనూ నక్షత్రాధిపతి అష్టమం లో ను ఉండుట వలన సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. ఈ రాశికి గురు బలం ఉన్నప్పటికీ లగ్నాధిపతి వీక్ గా ఉండుట వలన సమస్యలు వచ్చే అవకాసం వుంది. అశ్విని నక్షత్ర జతకులకి దివ్యంగా వుంది.వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి.భరణి నక్షత్ర జతకులకు కూడా సమంగా సవ్యంగా సాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు వుండవు.కృత్తిక నక్షత్రానికి ఈ రాశి వారికి అంతగా బాగా లేదు.సమస్యలు వచ్చే అవకాసం వుంది.కనుక జాగ్రత్త అవసరం..వృషభ రాశి వారికి దివ్యంగా జరిగే అవకాసం వుంది. ఈ రాసి కృత్తిక నక్షత్రం వారికి కొంచెం అంతగా బాగా ఉందనే చెప్పచ్చు జాగ్రత్త అవసరం. ఈ రాసి రోహిణి నక్షత్ర జాతకులకు అంతా సవ్యంగా సాగుతాయి .మిధున రాశి వారికి కలహాలు వచ్చే సూచనలున్నాయి కనుక శాంతంగా వుండాలి. ఈ రాశి లో మృగశిర నక్షత్ర జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా