By: Oneindia Telugu Video Team
Published : December 27, 2017, 06:18

28 వ తేదీ గురువారం 2017 దినఫలాలు

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 28 వ తేదీ గురువారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస శుద్ద దశమి రాత్రి 7 గంటల 50 నిమిషముల వరకు వుంది.అశ్విని నక్షత్రం రాత్రి 8 గంటల 28 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. భార్య సహకారం వుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వృషభ రాశి వారు అనుకున్న పనులు వాయిదా పడతాయి. పని వారి సహకారం పూర్తిగా వుంటుంది. మిధున రాశి వారికి అనుకున్న పనులు ఆటంకాల వలన వాయిదా పడవలసి వస్తుంది. అనవసర ఖర్చులు చేసే అవకాసం వుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కర్కాటక రాశి వారికి వ్యాపార అభివృద్ధి ప్రణాళికలు వేస్తారు. తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. సింహ రాశి వారికి దూర బంధు వార్తలు వింటారు. దగ్గరి బంధువులు కలయికలు వుంటాయి. కన్య రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. రుణాలు చేయవలసి వుంటుంది. ధన ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. తుల రాశి వారికి చేయు పనులు సుభ ఫలితాలని ఇస్తాయి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు నెమ్మదిగా జరుగుతాయి. దూర ప్రాంత వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ధనూ రాశి వారు పనులు భాద్యతగా పూర్తి చేయాలనుకుంటారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. మకర రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. ఇంటి పనుల యందు శ్రద్ద వహిస్తారు. కుంబ రాశి వారికి దగ్గరి ప్రయాణాలు చేయవలసి వ వస్తుంది. దగ్గరి బంధువుల రాక పోకలుంటాయి.అధికారులు మెప్పు కుడా పొందుతారు. మీన రాశి వారు ధన ప్రణాళికలు వేస్తారు. పిల్లల పట్ల శ్రద్ద వహిస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా