By : Oneindia Telugu Video Team
Published : December 11, 2017, 09:41

దిన ఫలాలు 11-12-2017

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 11 వ తేదీ సోమవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ నవమి తెల్లవారితే 5 గంటల 15 నిమిషముల వరకు వుంది. ఉత్తర నక్షత్రం 1౦ గంటల 36 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు ఏదైనా సాధించాలని తపనే పడే వారికి అవాంతరాలు ఏర్పడవచ్చు. అవకాశాలు చేజారే అవకాశం వుంది. వృషభ రాశి వారు తలచిన పనులు పూర్తవుతాయి. పని వారి సహకారం వుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారం వుంటుంది. మిధున రాశి వారికి ధన ఇబ్బందులున్నాయి. తలచిన పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి వారు దగ్గర ప్రయాణాలు చేయవలసి వుంటుంది. పిల్లల పట్ల ఆలోచన చేస్తారు. సింహ రాశి వారు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దైవ దర్సన ప్రాప్తి కలదు. కన్య రాశి వారు భూ సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఇంటి విషయాల యందు శ్రద్ద వహించి పూర్తి చేస్తారు. తుల రాశి వారికి ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. అవసరానికి డబ్బు చేకూరుతుంది. సోదరుల విషయం లో జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి వారు ఆలోచనలు ఎక్కువ చేస్తారు. దానానికి ఇబ్బంది కలదు. ధనూ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. అవసరాలకు అప్పులు చేయవలసి వస్తుంది. తండ్రి గారి ఆశీర్వాదం వల్ల మంచి జరుగుతుంది.. మకర రాశి వారు తలచిన పనులు ఆలస్యంగా జరుగుతాయి. అవకాశాలు చేజారే అవకాశం వుంది. కుంబ రాశి వారికి శరీర శ్రమ వుంటుంది.భార్య సహకారం వుంటుంది. మీన రాశి వారు కలహాలకు తావు ఇవ్వకండి. ఆర్ధిక పరమైన చిక్కులున్నాయి.వృత్తి వ్యాపారాలు విషయం లో శ్రమ పడవలసి వుంటుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more