By : Oneindia Telugu Video Team
Published : January 11, 2018, 06:29

దిన ఫలాలు 12-01-2018

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. జనవరి 12 వ తేదీ శుక్రవారం 2018 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస బహుళ ఏకాదశి..రాత్రి 10 గంటల 52 నిమిషముల వరకు వుంది. విశాఖ నక్షత్రం ఉదయం 9 గంటల 41 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి అనుకున్న పనులు వాయిదా పడతాయి.వృత్తి వ్యాపారాలు లభాన్నిస్తాయి. భార్య సహకారం వుంటుంది. వృషభ రాశి సోదరుల సహకారం వుంటుంది. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మిధున రాశి వారికి..ధనానికి ఇబ్బందులున్నాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. కర్కాటక రాశి వారికి .ధన ప్రణాళికలు వేస్తారు. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు భాద్యతగా చేయవలసి వుంటుంది. సింహ రాశి వారికి సోదరుల సహకారం వుంటుంది. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కన్య రాశి వారికి భక్తి ప్రవచనాలు వింటారు. చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. తుల రాశి వారికి భార్య సహకారం వుంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారు తలచిన పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాల యందు లాభాన్ని పొందుతారు. దూర బంధు వార్తలు వింటారు. ధనూ రాశి వారికి ఆరోగ్యం పై శ్రద్ద వహించండి. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా వుంటాయి..మకర రాశి వారికి చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు. వ్యాపారం అనుకులిస్తుంది. కుంబ రాశి వారికి చేయు పనులు బాధ్యతగా చేయవలసి వుంటుంది. తండ్రి గారి సహకారం పూర్తిగా వుంటుంది. మీన రాశి వారు దైవ దర్శన ప్రాప్తి కలదు. ఖర్చుల విషయం లో జాగ్రత్త అవసరం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా