By: Oneindia Telugu Video Team
Published : December 12, 2017, 06:35

దిన ఫలాలు 13-12-2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 13 వ తేదీ బుధవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ ఏకాదశి రాత్రి తెల్లవారితే 5 గంటల 5 నిమిషముల వరకు వుంది. చిత్త నక్షత్రం రాత్రి 11 గంటల 29 నిమిషముల వరకు వుంది. అమృత సమయం సాయంత్రం 4 గంటల 29 నిమిషముల నుంచి 6 గంటల 25 నిమిషముల వరకు ఉంది. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి తలచిన పనులు పూర్తవుతాయి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృషభ రాశి వారు చేయు పనులు సులువుగా సాగుతాయి.భార్య సహకారం పూర్తిగా వుంటుంది. మిధున రాశి వారికి ఈ రోజు చేయు పనులు ఆలస్యంగా పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కష్టపడవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.కర్కాటక రాశి వారికి ఇంటి పనులు పూర్తి చేస్తారు.అధికారులు ప్రసన్నం అవుతారు. సింహ రాశి వారికి ప్రేమానురాగాలు పొందుతారు. బంధు మిత్రుల కలయికలుంటాయి. సంతోషమైన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దైవ దర్సన ప్రాప్తి కలదు. కన్య రాశి వారికి తలచిన పనులు విజయవంతం గా పూర్తి చేస్తారు. ధన ప్రణాలికలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు విషయం లో లాభాపడతారు. తుల రాశి వారికి మనసు ప్రశాంతంగా సుఖంగా వుంటుంది. ధన ప్రణాలికలు వేస్తారు. ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. భార్య తో ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి వారు చేయు పనులు లాభాన్నిస్తాయి. ఆద్యాత్మిక ప్రసంగాలు వింటారు. భార్య అనుకూలంగా ఉండగలదు. ధనూ రాశి వారు చేయు పనులు భాద్యతగా చేయాల్సి వుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వృత్తి వ్యాపారాలు సామ్యం గా ఉండగలవు.మకర రాశి వారికి ఆటంకాలు వుంటాయి.దుర్గా దేవిని ఆరాధించండి. కుంబ రాశి వారికి పనులు భాద్యతతో పూర్తి చేయవలసి వుంటుంది. దూర బంధు సమాచారం వింటారు. మీన రాసి వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా