• search
By : Oneindia Telugu Video Team
Published : December 14, 2017, 10:48
Duration : 03:24

దిన ఫలాలు 14-12-2017

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 14 వ తేదీ గురువారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ ద్వాదశి రాత్రి తెల్లవారితే 5 గంటల 53 నిమిషముల వరకు వుంది. స్వాతి నక్షత్రం రాత్రి 12 గంటల 41 నిమిషముల వరకు వుంది. అమృత సమయం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషముల నుంచి 5 గంటల 50 నిమిషముల వరకు ఉంది. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి చేయు పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. తల్లి తండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. వృషభ రాశి వారు చేయు పనులు సఫలం అవుతాయి. రావలసిన డబ్బు చేతికందుతుంది. పని వారి సహకారం పూర్తిగా వుంటుంది. మిధున రాశి వారికి సొంత పనులు పూర్తి చేయడానికి ఇబ్బందులుంటాయి. ధననాన్ని సమకూర్చుకోవడం లో ఆటంకాలు వుంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.కర్కాటక రాశి వారికి ఇంటి పనులు పూర్తి చేస్తారు.తల్లి తండ్రులను బాగా చూసుకుంటారు. సింహ రాశి వారికి ఇంటి గురించి ఆలోచిస్తారు. ధన ప్రణాలికలు వేస్తారు. బంధు మిత్రుల కలయికలుంటాయి. సంతోషమైన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కన్య రాశి వారికి సోదర సహకారం వుంటుంది. ధన ప్రణాళికలు లాభాన్నిస్తాయి. తుల రాశి వారికి తలచిన పనులు పూర్తవుతాయి.రావలసిన సొమ్ము చేతికందుతుంది.వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వృశ్చిక రాశి వారు ఆద్యాత్మిక ప్రసంగాలు వింటారు. మంచి పనులకు డబ్బు సహాయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.భార్య అనుకూలంగా ఉండగలదు. ధనూ రాశి వారు చేయు పనులు భాద్యతగా చేయాల్సి వుంటుంది. దానానికి ఇబ్బందులుంటాయి. సోదర సహకారం వుంటుంది.వృత్తి వ్యాపారాలు సామ్యం గా ఉండగలవు.మకర రాశి వారికి చేయు పనులు ఆలస్యమవుతాయి.ధనానికి కొరత వుంటుంది. కుంబ రాశి వారికి చేయు పనులు లాభాన్నిస్తాయి. దూర బంధు సమాచారం వింటారు. మీన రాశి వారికి చేయు పనుల్లో విగ్నాలుంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. భాద్యతతో పనులు చేయవలసి వుంటుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more