By: Oneindia Telugu Video Team
Published : December 15, 2017, 09:54

దిన ఫలాలు 15-12-2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 15 వ తేదీ శుక్రవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ త్రయోదశి పూర్తిగా వుంటుంది. విశాఖ నక్షత్రం రాత్రి 2 గంటల 15 నిమిషముల వరకు వుంది. అమృత సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుంచి 6 గంటల 55 నిమిషముల వరకు ఉంది. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి చేయు పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. భూ సంబంధ పనులకు అనుకూలమైన రోజు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించవలసిన అవసరం వుంది. వృషభ రాశి వారు తలచిన పనులు పూర్తవుతాయి. ధన ప్రణాళికలు వేస్తారు. మిధున రాశి వారికి తలచిన పనులు పూర్తి చేయడానికి శ్రమ పడతారు . ధన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.కర్కాటక రాశి వారికి ఇంటి పనులుపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పిల్లలపై శ్రద్ద అవసరం. సింహ రాశి వారికి ఇంటి పనుల గురించి ఆలోచిస్తారు. బంధు మిత్రుల కలయికలుంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కన్య రాశి వారికి ఆర్ధిక లావాదేవీల గురించి చూస్తారు. తలచిన పనులు ఫలిస్తాయి.లాభ నష్టాలూ భేరీజు వేసుకుంటారు. తుల రాశి వారికి తలచిన పనులు పూర్తవుతాయి.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.వృశ్చిక రాశి వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆద్యాత్మిక ప్రసంగాలు వింటారు.భార్య అనుకూలంగా ఉండగలదు. ధనూ రాశి వారు చేయు పనులు యందు ఆటంకాలు వుంటాయి. భాద్యతగా చేయాల్సి వుంటుంది. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. భాద్యతతో పనులు చేయవలసి వుంటుంది. కుంబ రాశి వారికి చేయు పనుల యందు అడ్డన్కులుంటాయి. దూర బంధు సమాచారం వింటారు. మీన రాశి వారికిఆరోగ్య చిక్కులుంటాయి. విశ్రాంతి కి సమయం కేటాయించాలి. దైవారాధన చేయాలి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా