By: Oneindia Telugu Video Team
Published : December 15, 2017, 06:42

దిన ఫలాలు 16-12-2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 16 వ తేదీ శనివారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ త్రయోదశి ఉదయం 7 గంటల 14 నిమిషముల వరకు వుంది. అనురాధ నక్షత్రం రాత్రి తెల్లవారితే 3 గంటల 23 నిమిషముల వరకు వుంది. అమృత సమయం సాయంత్రం 5 గంటల 4 నిమిషముల నుంచి 6 గంటల 48 నిమిషముల వరకు ఉంది. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి ఇంటి పనులుపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు. అవకాశాలు చేజారే అవకాసం వుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించవలసిన అవసరం వుంది. వృషభ రాశి వారు భార్య అనుకూలంగా ఉండగలదు. తలచిన పనులు పూర్తవుతాయి.విదేశాల నుంచి మంచి వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. మిధున రాశి వారికి తలచిన పనులు పూర్తి చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. ధన ఇబ్బందులుంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.కర్కాటక రాశి వారికి చేయు పనులు యందు ఆటంకాలు వుంటాయి. అయినప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంటి పనులు ఆనందంగా జరగ గలవు. సింహ రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాత్రు సుఖం చూస్తారు.బంధు మిత్రుల కలయికలుంటాయి. కన్య రాశి వారికి దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరుల రాకపోకలుంటాయి. తుల రాశి వారికి తలచిన పనులు పూర్తవుతాయి.మనసు ఆనందంగా వుంటుంది. ధన ప్రణాళికలు వేస్తారు. వృశ్చిక రాశి వారు మనసు ఆనందంగా వుంటుంది.మంచి ఆలోచనలు చేస్తారు. అనుకున్న పనులు జరుగుట కొరకు ప్రయత్నం చేస్తారు. ధనూ రాశి వారు చేయు పనులు యందు ఆటంకాలు వుంటాయి. ధనం కోసం అప్పులు చేయవలసి వుంటుంది. భాద్యతతో పనులు చేయవలసి వుంటుంది. మకర రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. కుంబ రాశి వారికి అనుకున్న పనులు జరుగుట కొరకు ప్రయత్నం చేస్తారు.సహచరుల సహకారం వుంటుంది. మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దైవారాధన చేయాలి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా