By : Oneindia Telugu Video Team
Published : December 19, 2017, 06:13

దిన ఫలాలు 20-12-2017

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 20 వ తేదీ బుధవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస శుద్ద విదియ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల వరకు వుంది. పుర్వషాడ నక్షత్రం మద్యాహ్నం 3 గంటల 11 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి తండ్రి గారి సహకారం వుంటుంది. భార్య సహకారం తో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.తలచిన పనులు పట్టుదలతో పూర్తవుతాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వారు చేయు పనుల యందు ఆటన్కాలుంటాయి. కొన్ని అవకాశాలు చేతికి వచ్చి జారిపోయే అవకాసం ఉంది. పని వారి సహాయ సహకారాలు వుంటాయి.వృత్తి వ్యాపారాలు ఓ మాదిరిగా వుంటాయి. మిధున రాశి వారికి ధన ఇబ్బందులుంటాయి. పిల్లలు భాద్యతతో వ్యవహరిస్తారు. కర్కాటక రాశి వారికి ధన ఇబ్బందులుంటాయి. ఇంటి పనుల యందు శ్రద్దగా చేయవలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. సింహ రాశి వారికి దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులు సహకారం వుంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. కన్య రాశి వారికి ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. తల్లి తండ్రులను బాగా చూసుకుంటారు. ధన ప్రణాళికలు వేస్తారు. పని వారి సహకారం వుంటుంది. తుల రాశి వారికి దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్య అనుకూలంగా ఉండగలదు. వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధన ప్రణాళికలు కార్య రూపం దాల్చుతాయి. రావలసిన సొమ్ము చేతికందుతుంది. ధనూ రాశి వారు ధనానికి కొరత వుంటుంది. తలచిన పనులు పూర్తి చేస్తారు. ధనం విషయం లో కొంత అశాంతి కలుగుతుంది. మిత్రుల సహకారం కూడా వుంటుంది. మకర రాశి వారికి భక్తి ప్రవచనాలు వింటారు. చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కుంబ రాశి వారికి బంధు మిత్రుల కలయికలుంటాయి. పనివారి సహకారం కూడా వుంటుంది. మీన రాశి వారికి భార్య సహకారం వుంటుంది. పిల్లలు ఆనందాన్ని కలుగాజేస్తారు.వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా