By: Oneindia Telugu Video Team
Published : December 26, 2017, 10:27

డిసెంబర్ 26 మంగళవారం దిన ఫలాలు

Subscribe to Oneindia Telugu

దిన ఫలాలు 26-12-2017

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 26 వ తేదీ మంగళవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస శుద్ద అష్టమి రాత్రి 9 గంటల 1 నిమిషముల వరకు వుంది. ఉత్తర బాద్ర నక్షత్రం రాత్రి 9 గంటల 4 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి చేయు పనులు పట్టుదలగా చేయవలసి వుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వృషభ రాశి వారు చేయు పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి. బంధు మిత్రుల కలయికలు వుంటాయి. మిధున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ఆనందాన్ని ఇస్తాయి. సోదరుల మిత్రుల సహకారం వుంటుంది. ధన ఇబ్బందులుంటాయి. కర్కాటక రాశి వారికి తండ్రి గారి సహాయ సహకారాలు పూర్తిగా వుంటాయి. దూర బంధు కలయికలు వుంటాయి. ధనం కోసం ప్రణాళికలు వేయవలసి వుంటుంది. సింహ రాశి వారికి ఆరోగ్యం విషయం లో శ్రద్ద వహించవలసి వుంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. కన్య రాశి వారికి చేయు పనుల యందు విజయం సాధిస్తారు. ధన ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. పని వారి సహకారంతో వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతాయి. తుల రాశి వారికి చేయు పనులు సుభ ఫలితాలని ఇస్తాయి. అవకాశాలు చేజారకుండా చూసుకోవలసి వుంటుంది. భార్య సహకారం పూర్తిగా వుంటుంది. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేయవలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ధనూ రాశి వారు ఆరోగ్య విషయం లో జాగ్రత్త అవసరం. ఇంటి పనులు బాధ్యతగా చేస్తారు. బంధు మిత్రు కలయికలు వుంటాయి. మకర రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కుంబ రాశి వారికి ధన ప్రణాళికలు అనుకున్న ఫలితన్నిస్తాయి. పని వారి సహకారం వుంటుంది. అధికారులు మెప్పు కుడా పొందుతారు. మీన రాశి వారు ఆనందంగా వుంటారు. అనుకున్న పనులు జరుగుతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా