By : Oneindia Telugu Video Team
Published : March 03, 2021, 07:20
Duration : 02:02
02:02
నన్ను క్షమించండి.. ఐపీఎల్‌పై స్టెయిన్ యూ టర్న్!
ఐపీఎల్ పై దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అసలు ఆటకు విలువ లేదన్నాడు. ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ , శ్రీలంక ప్రిమియర్ లీగ్ లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందని స్టెయిన్ చెప్పుకొచ్చాడు. అయితే స్టెయిన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో బుధవారం తనపై వస్తున్న విమర్శలపై దక్షిణాఫ్రికా పేసర్ స్పందించాడు.