By : Oneindia Telugu Video Team
Published : November 02, 2019, 06:50
Duration : 02:06
02:06
కోహ్లీ, మన్రో రికార్డు బద్దలు.. టీ20ల్లో వార్నర్ సరికొత్త రికార్డు !
శ్రీలంక పర్యటనకు ముందు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో డేవిడ్ వార్నర్ నిరాశపరిచాడు. ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 9.5 యావరేజితో 95 పరుగులు చేశాడు. యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎదుర్కొనడంలో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు.సరిగ్గా నెల రోజుల తర్వాత సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. మూడు టీ20ల సిరిస్‌లో మొత్తం 217 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఓ సరికొత్త రికార్డుని కూడా సృష్టించాడు.