By : Oneindia Telugu Video Team
Published : January 23, 2021, 05:00
Duration : 02:33
02:33
నట్టూ..నీ ఆట అద్భుతం... నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా!
టీమిండియా బౌలింగ్ సెన్సేషన్ టీ నటరాజన్‌పై ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నటరాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్లో తనదైన యార్కర్లతో ఆకట్టుకున్న నటరాజన్.. నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఆ తర్వాత ఊహించని విధంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి తన సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నయా యార్కర్ల కింగ్‌ను ఆకాశానికెత్తాడు.