By: Oneindia Telugu Video Team
Published : November 07, 2017, 06:18

పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి అంటే దోపిడి మాత్రమే !

Subscribe to Oneindia Telugu


నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు తో భారతదేశంలో చిన్న వ్యాపారాలను ప్రభావితం చేశారని మాజీ ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు అనేది వ్యవస్థీకృత దోపిడీ అని, చట్టబద్ధమైన, అవినీతితో కూడిన దొంగతనమని వివరించారు. అహ్మదాబాద్‌లో వ్యాపారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు, జిఎస్టిపై తన విమర్శలను పునరుద్ఘాటించారు. పెద్దనోట్లు రద్దు, జీఎస్టీపై మండిపడిన మన్మోహన్ సింగ్ వాటి కారణంగా ఆర్థిక వృద్ది, ఉద్యోగాలను హరించుకుపోయాయని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. గుజరాత్ లో డిసెంబర్ 9 నుంచి 14 తేదీ వరకు రెండు దశల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఆయన మాట్లాడారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన రోజు అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు ప్రజాస్వామ్యానికి చీకటి దినమని అభివర్ణించారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామిక దేశమూ ఇటువంటి నిర్బంధ చర్యను తీసుకోలేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు కేవలం చైనాకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఎగుమతులు పెరిగాయన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా