By : Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:27

నోట్ల రద్దును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ధర్నా

నోట్లు రద్దుకు నిరసనగా..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ నేతలు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళనా కార్యక్రమానికి సినీయర్ కాంగ్రెస్ నాయకులతో పాటు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. హైదరాబాద్ లోని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సర్వే సత్యన్నారాయణతో పాటు, పోన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఎన్డీఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ… తక్షణమే రెండు వేల నోట్లను ఇండియాలో రద్దుచేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా