By: Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 11:37

ధోని @300 తప్పకుండా తెలుసుకోవాల్సిన ధోని రికార్డులు....

Subscribe to Oneindia Telugu


ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం నాలుగో వన్డే జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ వన్డే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎంతో ప్రత్యేకం. మహేంద్ర సింగ్‌ ధోనికి ఇది 300వ వన్డే మ్యాచ్‌ కావడమే. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా ధోని నిలవనున్నాడు. ఇప్పటి వరకు సచిన్‌ టెండూల్కర్(363), రాహుల్‌ ద్రవిడ్‌(344), మహమ్మద్‌ అజారుద్దీన్‌(334), సౌరవ్‌ గంగూలీ(311), యువరాజ్‌ సింగ్‌(302)లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఎదిగి, ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ధోని గురువారం తన వన్డే కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్‌ ఆడనున్నాడు. వన్డే క్రికెట్లో గొప్ప ఫినిషర్‌గా పేరున్న ధోని... గత రెండు మ్యాచ్‌ల్లో ఛేదనలో కీలక ఇన్నింగ్స్‌లతో భారత్‌కు విజయాన్ని అందించాడు. రెండో వన్డేలో 45, మూడో వన్డేలో 67 పరుగులు చేసిన ధోని తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు. దీంతో ఈ మైలురాయి వన్డే మ్యాచ్‌లో ధోని గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో పాటు 2019 వరల్డ్‌ కప్‌ వరకు ధోని కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా