By : Oneindia Telugu Video Team
Published : November 05, 2019, 06:20
Duration : 02:18
02:18
డే-నైట్ టెస్టుకు.. గెస్ట్ కామెంటేటర్‌గా ధోనీ..!
భారత పర్యటనలో బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అనంతరం టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 14న తొలి టెస్ట్ జరగనుండగా... నవంబర్ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. కోల్‌కతా టెస్ట్ భారత్-బంగ్లాదేశ్‌లకు తొలి డేనైట్ టెస్టు మ్యాచ్. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఒకవైపు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సన్నాహాలు చేస్తున్నాడు.