By : Oneindia Telugu Video Team
Published : March 10, 2018, 01:01

నా భార్య కంటే కూడా నాకు ఎక్కువగా ధోనీనే ఇష్టమ్..


మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ చూసిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. అంతేకాదు భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. అలాంటి మహేంద్ర సింగ్ ధోని అంటే అభిమానం ఉండని అభిమానులు ఎవరు ఉంటారు .

పాకిస్తాన్‌కు చెందిన చాచా చికాగోలో నివసిస్తున్నారు. ప్రస్తుతం నిదాహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో మహ్మద్‌ బషీర్‌ అకా (చికాగో చాచా), భారత అభిమాని సుధీర్‌, బంగ్లా అభిమాని షోయబ్‌ అలీలతో కలిసి మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంలో తనకు ధోనీ అంటే ఎందుకు అంత ఇష్టమో వెల్లడించాడు.

‘2011 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మొహాలీ వేదికగా సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ కోసం నేను పాకిస్థాన్ నుంచి రెండు రోజులు ముందుగానే అక్కడి వచ్చా. టిక్కెట్‌ కోసమని మైదానం వద్దకు వెళ్లగా టికెట్లు లేవని చెప్పారు. దీంతో నేను తీవ్ర నిరాశ చెందాను. తిరిగి వెళ్లిపోదామని అనుకున్న నాలో మ్యాచ్‌ ఎలాగైనా చూడాలన్న బలమైన కోరిక అలాగే ఉండటంతో మరొక్కసారి ప్రయత్నించడంలో తప్పు లేదనుకున్నాను' అని అన్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా