• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 31, 2018, 07:38
    Duration : 01:17

    మహేంద్ర సింగ్‌ ధోనీ ని ప్రశంసలతో ముంచెత్తిన మైకేల్ హస్సీ

    ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ సరిగా రాణించలేకపోయాడు. ఈ విషయంపై నెటిజన్లతో పాటు పలువురు సీనియర్లు సైతం ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. వారికి ధీటుగా కోహ్లీతో పాటు సునీల్ గవాస్కర్‌లు ధోనీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు వారితో పాటుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ఏకీభవిస్తున్నాడు.
    ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న హస్సీ.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌)కు ప్రచార కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ ఫామ్‌ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు హస్సి మాట్లాడుతూ... 'ధోనీ ఇంగ్లాండ్‌ పర్యటనలో రెండు ఇన్నింగ్స్‌లే కదా సరిగ్గా ఆడలేకపోయింది. ధోనీ ఏంటో, ఎలా ఆడతాడో మన అందరికీ తెలుసు. మధ్యలో కొన్ని సార్లు ఏ ఆటగాడైనా గాడి తప్పుతాడు. ఇది అందరికీ జరిగేదే.'
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా