By: Oneindia Telugu Video Team
Published : July 24, 2017, 10:51

ధోని హ్యాట్రిక్ సిక్సర్లు చూసారా? (వీడియో)

Subscribe to Oneindia Telugu

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం నాడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీఎన్‌పీఎల్ ఓపెనింగ్ డేకి విచ్చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులను హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు.
అభిమానులు చూస్తుండగా వరుసగా మూడు బంతుల్ని సిక్సులుగా మలిచాడు. వివరాల్లోకి వెళితే... శనివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మ్యాచ్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ నిషేధం ముగియడంతో శనివారం పునరాగమనం కార్యక్రమాన్ని ఫ్రాంఛైజీ నిర్వహించింది. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జరుపున ఆడిన ప్రముఖ క్రికెటర్లు ఈ కార్యక్రమానికి జెర్సీ‌లు ధరించి హాజరయ్యారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా