By: Oneindia Telugu Video Team
Published : December 11, 2017, 04:23

అంపైర్ ఔట్ అనకముందే ధోనీయే చెప్పేశాడు..!

Subscribe to Oneindia Telugu

ధర్మశాల వేదికగా జరిగిన శ్రీలంక-భారత్ వన్డే మ్యాచ్‌లో అప్పటి వరకు విజయాల పరంపరలో ఉన్న టీమిండియా ఘోరపరాజయాన్ని చవిచూసింది. అయితే దీన్ని కొందరు నెటిజన్లు కోహ్లీ కొరతే టీం ఓడిపోవడానికి కారణమని అంటూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంచితే టీంకు బలంగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ తన వంతు ప్రయత్నం చేసి టీం పరువు నిలబెట్టాడు. ఆఖరివరకు పోరాడిన ధోనీ చివరి వికెట్ కూడా కోల్పోవడంతో అసహనానికి గురైయ్యాడు. బౌండరీలనే టార్గెట్ చేసి ఆడి వికెట్‌ను కోల్పోయాడు.
ఎప్పుడూ డీఆర్‌ఎస్‌ కోరడంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ms ధోనీని మించిన వారు లేరు! అనేది అతని అభిమానుల వ్యాఖ్య. ఇది మరోసారి రుజువైంది. ఎలా అంటే, తాజాగా శ్రీలంకతో ఆదివారం ధర్మశాలలో జరిగిన వన్డేలోనూ ధోనీ మరోసారి తన క్రికెట్‌ పరిజ్ఞానాన్ని చాటుకున్నాడు. ఎంత వేగంగా అంటే అంపైర్‌ వేలు పూర్తిగా పైకి ఎత్తకముందే డీఆర్‌ఎస్‌ కోరాడు.
శ్రీలంక స్పిన్నర్‌ వేసిన 32వ ఓవర్లో బుమ్రాను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. అవతలి ఎండ్‌లో ఉన్న ధోనీ వెంటనే స్పందించాడు. తక్షణం రివ్యూ కోరాలని బుమ్రాకు సూచించాడు. రివ్యూ బుమ్రాకు అనుకూలంగానే వచ్చింది. బుమ్రాకు బంతి ఆఫ్‌ స్టంప్‌ పక్కగా వెళ్లేదని తేలింది. దీంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా