By: Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 12:38

కోహ్లీ కెప్టెన్సీ లో ఆడాలీ... అంతే ఇంకేం లేదు

Subscribe to Oneindia Telugu

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్టులు ఆడాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు దినేశ్ కార్తీక్. భారత జట్టులో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో దినేశ్ కార్తీక్‌కు పెద్దగా అవకాశాలు రావడం లేదనేది అందరికీ తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత్ జట్టులో ఎట్టకేలకు చోటు దక్కించుకున్న దినేశ్ బ్యాట్‌తో మెరిశాడు. చివరి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్‌ నిర్ణయాత్మక ఐదో వన్డేలో 50 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ ఆ తర్వాత జరిగిన ఏకైక టీ20లో 48 పరుగులు చేశాడు. దీంతో మూడేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నట్లు అయింది. తనకు టెస్టుల్లో కూడా తిరిగి ఆడాలని ఉందనే విషయాన్ని స్పష్టం చేశాడు.ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తన మనసులోని మాటను బయట పెట్టాడు. 'ప్రస్తుతం వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాను. తెలుపు రంగు జెర్సీ ధరించి టెస్టు జట్టులో స్థానం సంపాదించి, విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో ఆడాలన్నది ప్రస్తుతం నా కల. జట్టుకు ఏ రకంగా ఉపయోగపడగలను అనేది మాత్రమే నాకు తెలుసు. అందుకోసం తీవ్రంగా సాధన చేస్తున్నా' అని కార్తీక్‌ తెలిపాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా