By: Oneindia Telugu Video Team
Published : December 15, 2017, 06:44

ఆక్టోపస్, కుక్కపిల్ల అన్నీ మ్యాచ్ లు, ఎన్నికల గురించి చెప్పేస్తున్నాయి. వీడియో

Subscribe to Oneindia Telugu

ఇక్కడ ఉన్న వీడియోలో ఓ యువతి చిన్న కుక్కపిల్లను ఎత్తుకొని.. మోడీ గుజరాత్ వస్తున్నారా అని అడిగితే, దానికి ఆ కుక్కపిల్ల కూడా స్పందించింది. రాహుల్ వస్తున్నారా అని అడిగితే మాత్రం స్పందించలేదు. ఈ వీడియోను అమిత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ క్యూట్ కుక్కపిల్లకు అన్నీ తెలుసు అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపుకు ముందు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూగజీవి కూడా మోడీకే మద్దతు ఇస్తోందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
అయితే మూగ జీవులు, జంతువులు ఇలా ప్రిడిక్ట్ చెయ్యడం కొత్తేమీ కాదు. మ్యాచ్ ల గురించి, ఎన్నికల ఫలితాల గురించి జంతువులు చెప్పటం గురించి మనకు తెలుసు. అయితే అవి చాలా సందర్భాల్లో నిజమవుతాయ్ కూడా. పాల్ ది ఆక్టోపస్, కొన్ని సందర్భాల్లో ఏనుగులు ఇలా చాలా జంతువులు మ్యాచ్ లకు జోస్యం చెపుతూ ఉంటాయి. ఇక వీటిలో పాల్ ది ఆక్టోపస్ కి చాలా ప్రాముక్యత ఉంది. ఫుట్ బాల్ మ్యాచ్ లను ప్రిడిక్ట్ చెయ్యటంలో ఇది దిట్ట. 2010 ఫిఫా వరల్డ్ కప్ సమయంలో పాల్ ది ఆక్టోపస్ ప్రిడిక్ట్ చేసిన 8 మ్యాచ్ ల రిసల్ట్ కరెక్ట్ అయిందంటే ఆక్టోపస్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. అంతేకాదు ఏనుగులు కూడా ప్రిడిక్ట్ చేస్తాయి. తొండంతో టచ్ చేసో లేదంటే ఇంకో రకంగా నో వాటి జడ్జ్మెంట్ అవి ఇస్తాయి. అయితే కొన్ని జంతువులు ముందు రెండు టీంల ఫ్లాగ్స్ పెడతారు, కొన్నిసార్లు రెండు టీంల గుర్తులతో ఏవయినా బౌల్స్ పెడతారు. వాటిలో ఉన్న ఐటమ్స్ ని టచ్ చేసిన దానిబట్టి ఏ టీం గెలుస్తుందో చెబుతారు. అలాగే పంది, ఎలుగుబంటి ఇలాంటివి కూడా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఎక్కువశాతం ఇవి ఫుట్ బాల్ మ్యాచ్ లను ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా