By: Oneindia Telugu Video Team
Published : November 07, 2017, 06:25

కొరియాలో ట్రంప్ టూర్, టెన్షన్...టెన్షన్

Subscribe to Oneindia Telugu


ఉత్తరకొరియాకు సమీపంలో ఉన్న దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్య మాటల యుద్దం సాగుతున్న తరుణంలో దక్షిణకొరియాలో ట్రంప్ పర్యటన టెన్షన్ సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ నిర్వహించిన అణు, క్షిపణి పరీక్షలతో ప్రపంచమంతా భయాందోళనలను వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి కూడ ఈ విషయమై కిమ్ జంగ్‌ఉన్ హెచ్చరించింది. అయినా కిమ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియాపై యుద్దానికి సిద్దమంటూ సంకేతాలు పంపారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కూడ ఈ విషయమై అమెరికాతో తాడోపేడో తేల్చుకొంటామని చెప్పారు.
అమెరికాకు ధీటుగానే కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సమాధానమిచ్చారు. అమెరికాలో చిమ్మచీకట్లు కమ్ముకొనేలా చేస్తామని కూడ కొరియా అధినేత హెచ్చరికలు జారీ చేశారు. ఈ రకమైన ఉద్రిక్తతలున్న తరుణంలో కిమ్ జంగ్ ఉన్ దక్షిణ కొరియాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా