• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 13, 2018, 03:27
    Duration : 01:33

    జయలలితకు నేను చికిత్స చెయ్యలేదు ! డాక్టర్ స్వామినాథన్


    తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి విషయంపై విచారణ చేస్తున్న మద్రాసు హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రతి విషయం బయటకు లాగుతోంది. జయలలితకు ఎవరెవరు చికిత్స చేశారు అనే పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ స్వామినాథన్ జయలలితకు చికిత్స చెయ్యలేదని విచారణలో వెలుగు చూసింది.
    డాక్టర్ స్వామినాథన్ ప్రముఖ కార్డియాలజిస్ట్. జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 5వ తేదీ రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో మరణించారని అపోలో ఆసుపత్రి ప్రకటించింది.
    తమిళనాడులో ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ స్వామినాథన్ జయలలితకు చికిత్స చేశారని, అయితే చికిత్స విఫలం అయ్యి అమ్మ మరణించారని ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. డాక్టర్ స్వామినాథన్ చికిత్స చేశారు అనే ప్రచారం ఎంతో వరకు నిజం అనే విషయం వెలుగు చూడలేదు.
    జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న మద్రాసు హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వామినాథన్ ను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
    జయలలితకు చికిత్స చెయ్యడానికి తనకు అనుమతి ఇవ్వలేదని, అసలు ఆమెను తాను ఆసుపత్రిలో చూడనేలేదని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వామినాథన్ జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వివరణ ఇచ్చారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా