By: Oneindia Telugu Video Team
Published : December 15, 2017, 12:05

సెమీస్‌కు సింధు!... శ్రీకాంత్‌ ఇంటికి

Subscribe to Oneindia Telugu


దుబాయి సూపర్ సిరిస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అంచనాలకు తగ్గట్లే రాణిస్తోంది. మహిళల సింగిల్స్‌ విభాగంలోని గ్రూప్‌ 'ఎ' లీగ్‌ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 21-13, 21-12తో సయాకా సాటో (జపాన్‌)ను చిత్తుగా ఓడించి సెమీస్‌కు చేరుకుంది.
36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు 21-13, 21-12తో విజయం సాధించింది. తొలి గేమ్‌ సగం వరకు సింధుకు సయాకా నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆరంభంలో 1-3తో వెనుకబడిన సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 7-3తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత సింధు తన జోరుని మరింతగా పెంచింది. 15-11తో ఆధిక్యంలో ఉన్నపుడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన సింధు.. అదే ఊపులో గేమ్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సింధు అద్భుత ఆటతీరుని ప్రదర్శించింది. విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో ఉన్న సింధు.. తర్వాత చెలరేగిపోయింది. వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 19-7తో ముందంజ వేసింది. ఆ తర్వాత సాటోకు ఐదు పాయింట్లు కోల్పోయినా... ఏకాగ్రత కోల్పోకుండా విజయానికి అవసరమైన రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ని ముగించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా