• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 19, 2018, 02:33
    Duration : 01:43

    బడ్జెట్ తర్వాత మొబైల్స్ ధరల పెరుగుదల.. ఎందుకంటే?

    2018 కేంద్ర బడ్జెట్ తర్వాత స్మార్ట్‌ఫోన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఇతర దేశాల నుండి పరికరాలను దిగుమతి చేసుకోవడం కంటే ఇండియాలోనే వస్తువుల తయారీని పెంచిపోషించేందుకు అనువుగా కొన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని విధించాలని కేంద్రం యోచిస్తోందని సమాచారం.దీంతో రానున్న రోజుల్లో అత్యాధునిక మొబైల్స్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
    దేశాన్ని మేకిన్ ఇండియాగా తీర్చి దిద్దనున్నట్టు ప్రధాన మంత్రి మోడీ ప్రకటించారు. ఈ మేరకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. అయితే ఇతర దేశాల నుండి వస్తువులు, పరికరాలను దిగుమతి చేసుకోవడం కంటే ఇండియాలోనే వస్తువుల తయారీని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.
    కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వా స్మార్ట్‌పోన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ తర్వాత స్మార్ట్‌పోన్, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ వేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.
    ప్రస్తుతం ఎలాంటి సుంకాలు లేని ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, కెమెరా మాడ్యూల్స్‌, డిస్‌ప్లేలపై, రానున్న బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. జీఎస్‌టీ రాకతో ప్రస్తుతం కేవలం కస్టమ్స్‌ డ్యూటీ మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది.
    ఇండియాలో వస్తువుల ఉత్పత్తిని పెంచేందుకుగాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంటుందని సమాచారం. కేవలం ఎలక్ర్టానిక్‌ పరికరాల అసెంబ్లింగ్‌ హబ్‌లా కాకుండా తయారీ హబ్‌గా మలచాలన్న ఉద్దేశంతో ఆయా పరికరాల దిగుమతిపై కస్టమ్స్‌ డ్యూటీ విధించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా