By: Oneindia Telugu Video Team
Published : June 28, 2017, 04:00

కోహ్లీ అహంకారాన్ని దించుతా .. కోచ్ పదవి నాకివ్వండి

Subscribe to Oneindia Telugu

కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే గత వారంలో రాజీనామా చేయడంతో ప్రధాన కోచ్ లేకుండానే వెస్టిండిస్‌లో టీమిండియా పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్ కోసం బీసీసీఐ రెండో సారి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ప‌దవి ‌కోసం తాను కూడా పోటీలోకి దిగుతానని పేర్కొంటూ ఓ ఇంజ‌నీర్ బీసీసీఐకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. ఆ వ్య‌క్తి పేరు ఉపేంద్రనాథ్‌ బహ్మచారి.భారత క్రికెట్ చరిత్రలో లెజండ్లలో ఒకరిగా భావించే అనిల్ కుంబ్లే అర్థంతరంగా కోచ్ పదవి నుంచి వైదొలగడంపై ఓ క్రికెట్ వీరాభిమాని వినూత్నంగా స్పందించాడు. వృత్తి పరంగా మెకానికల్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఉపేంద్రనాథ్ (30) అనే వ్యక్తి కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. అహంకారభావంతో ప్రవర్తించే కోహ్లీని సరైన దారిలో పెట్టేందుకు తనకు అవకాశం ఇవ్వాలని తన దరఖాస్తులో కోరిన అతను, బీసీసీఐ వెబ్ సైట్ లోని ఈ-మెయిల్ ఐడికీ దరఖాస్తు పంపాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా