సెంచరీ చేయకపోతే టార్చర్ పెడతారు!
Published : May 27, 2022, 05:50
ఐపీఎల్ ముగిసిన వెంటనే డేవిడ్ వార్నర్ తన స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అక్కడి మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కుటుంబ సభ్యులు- ప్రత్యేకించి కూతుళ్లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. వారికి తన బ్యాటింగ్ అంటే ఎంత ఇష్టమో వివరించాడు. తాను బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి దిగిన ప్రతీసారీ- సెంచరీ చేయాలని కుమార్తెలు కోరుకుంటారని చెప్పాడు.