By: Oneindia Telugu Video Team
Published : December 07, 2017, 05:52

ది బెస్ట్ 'facebook':ది వేస్ట్ 'Apple'అంట !

Subscribe to Oneindia Telugu


అమెరికాలో ది బెస్ట్ వర్క్ ప్లేస్‌ కంపెనీగా ఫేస్‌బుక్ టాప్ లో నిలిచింది. అంతర్జాతీయంగా చాలా పాపులర్ అయిన ఆపిల్ మాత్రం ఏకంగా 36వ స్థానం నుంచి 84వ స్థానానికి పడిపోయింది. ఎంప్లాయిస్ ఛాయిస్ అవార్డుల్లో భాగంగా.. అమెరికాలోని ప్రముఖ వెబ్‌సైట్ గ్లాస్ డోర్ ఈ ర్యాంకింగ్స్ వెల్లడించింది. 'అమెరికాలోని 100 అత్యుత్తుమ పని ప్రదేశాలు' పేరుతో ఆయా కంపెనీల ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ర్యాంకింగ్ విషయంలో వెనుకబడ్డ ఆపిల్ రేటింగ్ విషయంలో మాత్రం 4.3/5 రేటింగుతో టాప్‌లో నిలిచింది.
ది బెస్ట్ వర్క్ ప్లేస్ జాబితాలో ఫేస్‌బుక్‌ అనంతరం గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీ చోటు దక్కించుకుంది. దీని తర్వాత బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, ఇన్‌-అండ్‌-అవుట్‌ బర్గర్‌, గూగుల్‌లు ఉన్నాయి. గ్లాస్‌డోర్‌ సీఈవో రోబర్ట్‌ హన్‌మాన్‌ ఫేస్‌బుక్‌ టాప్ లో నిలవడంపై స్పందించారు. ఉద్యోగులు ఎక్కువ ఫేస్‌బుక్‌లో పనిచేయడానికే మొగ్గుచూపుతున్నారని అన్నారు. ఫేస్‌బుక్‌ పారదర్శక నాయకత్వం, అక్కడి పని ప్రదేశంలో ఉండే వాతావరణం ఇందుకు కారణాలుగా ఆయన చెబుతున్నారు. 2016 నవంబర్‌ 1-2017 అక్టోబర్‌ 22 వరకు ఉద్యోగుల ఫీడ్ బ్యాక్, రేటింగ్, కంపెనీ రివ్యూల ఆధారంగా గ్లాస్‌డోర్‌ ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా