By: Oneindia Telugu Video Team
Published : December 30, 2017, 06:45

మోసపోయిన ఉపరాష్ట్రపతి : లావుగా ఉండటం ప్రాబ్లం కాదు, ఆరోగ్యంగా లేకపోవడం ప్రాబ్లం

Subscribe to Oneindia Telugu

నకిలీ ప్రకటనల బెడద ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైంది. బరువు తగ్గిస్తాం అటూ కొన్ని ప్రకటనలు ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నాయి. అయితే ఆ ప్రకటనల బెడద మామూలు జనానికే కాదు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కూడా ఎదురయిందట.

శుక్రవారం రాజ్యసభలో స్వయంగా ఆయనే ఈ విషయాన్ని బయటపెట్టడం గమనార్హం. నకిలీ ప్రకటనలపై రాజ్యసభలో లేవనెత్తిన చర్చలో వెంకయ్య తన అనుభవాన్ని పంచుకున్నారు.
వెయ్యి రూపాయలకే బరువు తగ్గొచ్చన్న ఓ ప్రకటనను చూసి.. తను డబ్బులు చెల్లించి ఆర్డర్‌ బుక్‌ చేశానని తెలిపారు.అయితే తర్వాత మరో మెయిల్‌ వచ్చిందని.. మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తే అసలైన టాబ్లెట్లను పంపిస్తామని అందులో ఉందని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించి వినియోగదారుల సంబంధిత మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశానని తెలిపారు ఇలాంటి నకిలీ ప్రకటనలపై చర్యలు తీసుకోవాలన్నారు. బరువు తగ్గించే మాత్రల పేరిట ఇటీవల తనే రూ. 1230 నష్టపోయానంటూ ఆయన సొంత అనుభవాన్ని వివరించారు.

అయితే ఇదంతా పక్కనబెడితే ఉపరాష్ట్రపతి కానివ్వండి మరెవరైనా కానివ్వండి. బరువు తగ్గిస్తాం అని ఏదయినా ప్రకటన కనబడగానే కచ్చితంగా టెంప్ట్ అవుతారు. కొంతమంది వీలు లేక వదిలేస్తారు ఇంకొంతమంది ఇలా ముందుకెళ్ళి బొక్క బోర్లా పడతారు. అసలు కొంచెం లావుగా ఉంటె ఏంటి ప్రాబ్లం. లావుగా ఉండటం ప్రాబ్లం కాదు, ఆరోగ్యంగా లేకపోవడం ప్రాబ్లం. లావుగా ఉంటేనే అనారోగ్యం వస్తుదనుకోవడం పొరబాటు. ఏ సన్నగా ఉన్నవాళ్ళు రోగాల బారిన పడట్లేదా ? కాబట్టి మనం ఆలోచిన్చుకోవాల్సింది కొంచెం లావుగా ఉంటె ఎలా తగ్గాలి అని కాదు. ఆరోగ్యంగా ఎలా ఉండాలని.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా