కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ,జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఫ్యాన్స్ డిమాండ్ *Cricket
Published : June 26, 2022, 08:30
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మళ్లీ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. రోహిత్ శర్మ సైతం కరోనా పాజిటీవ్‌గా తేలాడు. దాంతో ఇంగ్లండ్‌తో జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్ట్‌కు అతను దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలోనే జట్టు సారథ్య బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించాలని ఫ్యాన్స్ బీసీసీఐకి సూచిస్తున్నారు.