By: Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:43

చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఫ్రెండ్ ప్రతినిధులు

Subscribe to Oneindia Telugu

చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ ఇండో-ఫ్రెంచ్ వర్క్ షాప్‌లో మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. పాదచారుల ప్రాజెక్ట్ అంటే టైల్స్ వేయడం కాదని.. చారిత్రక కట్టడాలు కాపాడాలని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ట్రామ్ వే, బీఆర్టీఎస్‌కు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మేయర్ స్పష్టం చేశారు. ట్రామ్ వే ఏర్పాటుకు ఫ్రెంచ్ ముందుకు రావడం సంతోషకరంగా ఉందని మేయర్ తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కూడా త్వరలో చర్యలు చేపడతామన్నారు. మూసీకి ఇరువైపులా ట్రామ్ వే ఏర్పాటు చేస్తామని మేయర్ స్పష్టం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా