• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 06, 2018, 04:41
    Duration : 01:32

    సామూహిక దాడులుపై రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి: రాజ్‌నాథ్ సింగ్

    సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న కొన్ని పోస్టులు ఇతరుల ప్రాణాలను తీస్తున్నాయి. ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం వదంతులను నమ్మొద్దని ఎన్ని హెచ్చరికలు చేసిన ప్రజలు మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని యదేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి దాడుల్లో బలైంది సాటి భారతీయులే కాగా... ఇప్పుడు ఆ దాడులు విదేశీయులపైకి కూడా పాకాయి. ఇందుకు నిదర్శనం కాకినాడ బీచ్‌ను చూసేందుకు వచ్చిన ఓ విదేశీయుడిపై అక్కడి స్థానికులు దాడి చేయడమే. కాకినాడ బీచ్ అందాలను చూసేందుకు మైఖేల్ ప్రాక్టర్ అనే జర్మనీ దేశస్తుడు వచ్చాడు. సూర్యారావుపేట సమీపంలోని బీచ్‌కు చేరుకున్నాడు యువకుడు. మద్యం తాగి బీచ్‌వైపు నడుస్తుండగా అతనిని గమనించిన స్థానికులు ఉన్మాదిగా భావించి మైఖేల్‌ను చితకబాదారు.విచక్షణా రహితంగా చితకబాదడంతో మైఖేల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మైఖేల్ పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని, ఎవరు దాడి చేశారన్న విషయమై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా