By: Oneindia Telugu Video Team
Published : November 28, 2017, 12:39

GES సదస్సు ప్రత్యేకతలివే : మహిళలే లక్ష్యం

Subscribe to Oneindia Telugu


హైద్రాబాద్‌లో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పది దేశాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతినిధుల్లో మహిళలు తప్ప, పురుషులు లేరు. మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకొని ఈ సదస్సును నిర్వహించనున్నారు. అమెరికాలో కాకుండా దక్షిణాసియాలో జరుగుతున్న తొలి సదస్సు హైద్రాబాద్‌దే కావడం విశేషం.
మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకొని నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.మరో వైపు ఈ సదస్సుకు హజరౌతున్న ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.
మూడు రోజుల పాటు హైద్రాబాద్‌ నగరం జీఈఎస్ సదస్సుకు అతిథ్యం ఇవ్వనుంది.ఈ సదస్సును ఇవాంకా ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. అయితే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు హజరుకానున్నారు. ఈ సదస్సు ప్రత్యేకంగా మహిళా పారిశ్రామిక వేత్తలపై ఫోకస్ పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ లాంటి దేశాల నుండి మహిళా ప్రతినిధులే ఈ సదస్సుకు హజరౌతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 52.5 శాతం మహిళా ప్రతినిధులే ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అమెరికా నుండి హజరైన ప్రతినిధులకు ఇవాంకా ట్రంప్ సారధ్యం వహిస్తున్నారు. అయితే అమెరికాలోని 38 రాష్ట్రాల నుండి ఈ సదస్సులో పాల్గొంటున్న మహిళా పారిశ్రామికవేత్తల్లో 30 ఏళ్ళలోపు వయస్సున్నవారు 5 శాతం ఉంటారని నిర్వాహకులు ప్రకటించారు.ఈ సదస్సులో పాల్గొంటున్నవారిలో 13 ఏళ్ళ వయస్సున్న పారిశ్రామికవేత్త అత్యంత పిన్న వయస్సున్నవారు. కాగా, 84 ఏళ్ళ వయస్సున్న వారు కూడ ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా