By: Oneindia Telugu Video Team
Published : November 29, 2017, 01:15

ఐడియాలు ఎవడబ్బ సొత్తూ కాదు!

Subscribe to Oneindia Telugu

హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ రెండో రోజు వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు. కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ పాలుపంచుకున్నారు. మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, క్రీడలు తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. పలువురు ప్రముఖులు మాట్లాడనున్నారు. ఇవాంకా, చందాకొచ్చార్, కేటీఆర్‌లు మహిళా సాధికారత అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
విభిన్న రంగాలలో మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని ఇవాంకా చెప్పారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. సాంకేతిక రంగాలలో మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు అన్ని ప్రయివేటు రంగాలలో వస్తున్నాయని చెప్పారు. మహిళల అభివృద్ధికి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించాలన్నారు. నూతన పాలసీలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ రంగంలో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు అమెరికా ప్రభుత్వ విద్యావ్యవస్థలో మార్పులు చేస్తోందని చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా