By : Oneindia Telugu Video Team
Published : November 29, 2017, 09:55

మోడీ, భారత్ మాకు ఆదర్శం


హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంకా ట్రంప్ మంగళవారం ప్రారంభించారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మాట్లాడారు.
ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని ఇవాంకా ట్రంప్ అన్నారు. 150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు శుబాకాంక్షలు అన్నారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అని చెప్పారు. కొత్త ఆవిష్కరణలకు ముందుకు వస్తున్న యువతకు స్వాగతం అన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత బిర్యానీకి హైదరాబాద్ పుట్టినిల్లు అని ఇవాంకా ట్రంప్ అన్నారు. టి హబ్ ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్‌హగా వాసికెక్కుతుందని తెలిపారు. ప్రజల జీవన పరిణామానాల్లో మార్పులు తెచ్చేందుకు ఔత్సాహికులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కాంక్ష వదలకుండా కృషి చేయాలన్నారు.
మార్పు సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపిస్తున్నారని కితాబిచ్చారు. మోడీ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. భారత్‌ను పేదరికం నుంచి బయటపడేసేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య విజయానికి భారత్ ఆశాదీపంగా ఎదుగుతోందన్నారు. టీ అమ్ముకునే స్థాయి నుంచి మోడీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్వితీయం అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా