By: Oneindia Telugu Video Team
Published : January 08, 2018, 01:30

గజల్ శ్రీనివాస్‌, యాంకర్ ప్రదీప్ ఇష్యూస్

Subscribe to Oneindia Telugu

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పంజాగుట్ట పోలీసుల పిటిషన్‌ను గురువారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రిమాండ్ రిపోర్టులో విచారణకు సంబంధించిన వివరాలను పొందుపరిచి, వీడియోలతో సహా అన్ని ఆధారాలనూ సంపాదించిన తర్వాత ఆయనను ఏం విచారిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోడిపందాలపై హైకోర్టు తీర్పు పందెం రాయుళ్లకు షాకిచ్చింది. అంతేకాదు కోడి పందాల నిర్వహణ విషయంలో ఎపి ప్రభుత్వం తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా గత ఏడాది కోడిపందాల ను నిరోధించడంలో విఫలమైనందుకు అత్యున్నత స్థాయి అధికారులకు సైతం నోటీసులు జారీచెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ దందాను అడ్డుకున్నందుకు వీఆర్ఏ సాయిలును దారుణంగా హత్య చేశారు. దుండగులు ట్రాక్టరుతో తొక్కించి అతనిని చంపేశారు. ఇది కలకలం రేపుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ వ్యవహారం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌కు రాకపోవడంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. దానిపై ప్రదీప్ స్పందించారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా