By: Oneindia Telugu Video Team
Published : January 11, 2018, 02:31

గజల్ శ్రీనివాస్‌ ఏమయ్యాడు ?

Subscribe to Oneindia Telugu


మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్ ఇటీవల మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పోలీసులు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వవద్దని కోరారు. ఏ2 నిందితురాలు పార్వతి పరారీలో ఉన్నారని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. గజల్ కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్ ఇంకా రికార్డ్ చేయాల్సి ఉందని చెప్పారు. బాధితులు పెరిగే అవకాశముందని, సాక్ష్యులను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అయితే అంతకముందు మహిళల లైంగిక వేధింపుల కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై న్యాయస్థానం తీర్పు కోసం నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సెక్షన్ 354, 354ఏ బెయిలబుల్ కేసులు అయినప్పటికీ పోలీసులు బెయిల్ ఇవ్వలేదని గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు వాదించారు.
కాగా వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వకుండాననే పోలీసులు అరెస్టు చేశారని, అందుచేత పోలీసు కస్టడీ అవసరం లేదని వాదనలు వినిపించారు. మరోవైపు, గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని పోలీసులు కౌంటర్‌లో దాఖలు చేశారు. గజల్ విచారణకు అందుబాటులో ఉంటారని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారని పూర్తిగా సహకరిస్తారని గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు చెప్పారు. అయితే దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఆయనకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా