By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సికింద్రాబాదులోని ప్రముఖ వాణిజ్య సముదాయం చంద్రలోక్ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నోటీసులు కూడా అతికించారు. వస్త్ర వ్యాపార కార్యాలయాలు కలిగిన చంద్రలోక్ కాంప్లెక్స్ సుదీర్ఘ కాలంగా సికింద్రాబాదులో పేరుప్రతిష్ఠలు సంపాదించుకుంది. బిల్డింగ్ కాలపరిమితి ముగిసిపోవడంతో కూలిపోయే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రలోక్ కాంప్లెక్స్ ను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమీషనర్ జనార్ధన్ రెడ్డి సందర్శించారు. అయితే వీరికి ఇక్కడ ఒక ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా