By: Oneindia Telugu Video Team
Published : November 28, 2017, 04:16

HICC కి చేరుకున్న ఇవాంకా

Subscribe to Oneindia Telugu

హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభిస్తారు. అంతకుముందు, మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వేర్వేరుగా ఇక్కడకు చేరుకున్నారు. మియాపూర్ రైల్వే స్టేషన్లో మెట్రోను ప్రారంభించిన అనంతరం మోడీ హెలికాప్టర్‌లో వచ్చారు. ట్రైడెంట్ హోటల్ నుంచి ఇవాంకా బృందం చేరుకుంది. అమెరికా శ్వేతసౌధం సలహాదారు హోదాలో ఇవాంకా వచ్చారు. మహిళలకు అవకాశాలు పెంచడంపై ఇవాంకా మాట్లాడనున్నారు. మూడు రోజుల పాటు హెచ్ఐసీసీ సదస్సు ఉంటుంది. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు ప్రసంగిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం గం.1.25 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా