• search
By : Oneindia Telugu Video Team
Published : June 09, 2018, 08:35
Duration : 04:02

మీరు గోవా కి ప్లాన్ చేస్తున్నరా...అయితే ఈ వీడియో చూడాల్సిందే


భారత దేశంలో ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో గోవా ఒకటి. కేవలం భారతీయులనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడం దీని ప్రత్యేకత. తక్కువ ఖర్చులో హాలీడేస్‌ స్పాట్‌ను ఎంజాయ్ చేయాలనుకునే పర్యాటకులకు జాబితాలో గోవా మొదటి స్థానంలో ఉంటుంది.
ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. అక్కడ లభించే చవకైన ఆల్కహాల్ నుండి అందమైన బీచ్ వరకు అన్ని ఆకర్షణీయమే. ఈ ప్రాంతానికిగల విశ్వజనీనమైన ఆదరణ చాలామంది యువకులను మరియు పెద్దలను కూడా ఒకే రకంగా ఆకర్షించేదిగా ఉంటుంది. భారతదేశంలోని కోస్తాతీర నగరాలు, పట్టణాలలో ఉండే చక్కని వేసవి సెలవుల అనుభవాలు గోవాలో కూడా అమితంగా లభిస్తాయి. గోవా పట్టణన్ని పరిశీలిస్తే, ముందుగా ప్రతి ఒక్కరూ గమనించేది ఈ ప్రదేశం పోర్చుగీసు జీవన విధానంతో ప్రధానంగా ప్రభావించబడిందని గుర్తిస్తారు. దీనికి కారణం పోర్చుగీసు వారు ఈ ప్రాంతాన్ని సుమారుగా అరవైల వరకు పాలించారు. ఇంతేకాక, గోవా ప్రజలు వారి సాంప్రదాయ వారసత్వానికి గర్వపడతారు. వారికిగల వారసత్వ భవనాలు, ఇతర మానవ నిర్మిత కట్టడాలు, సహజ సిద్ధ చిహ్నాలను పరిరక్షించుకుంటారు. ఈ పట్టణం ప్రపంచంలోని వివిధ దేశాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. బీచ్ ప్రదేశాలు కల బ్యాంకాక్, ఇబిజ వంటి పట్టణాలతో పోలిస్తే, గోవా అధిక పర్యాటకులను ఆకర్షిస్తుంది.
మరి గోవాలో ఒక రోజు ఆనందంగా ఎలా గడపాలి? గోవాలో ప్రత్యేకత ఏమంటే? ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే ఒక బీర్ బాటిల్ సైతం పుచ్చుకోవడమనేది సర్వ సాధారణం. కండోలిం వీధులను కాలినడకన లేదా ఒక ద్విచక్రవాహనం అద్దెకు తీసుకోవడం ద్వారా చూడవచ్చు. ద్విచక్రవాహనం రోజుకు రూ.250 మించి సాధారణంగా ఉండదు. కనుక మీరు బ్రేక్ ఫాస్ట్ ప్రదేశం చేరేముందదే అతి చవక ధరలలో కొంత షాపింగ్ కూడా చేయవచ్చు. టి- షర్టులు, సన్ గ్లాసులు, రిఫ్రిజిరేటర్ మాగ్నెట్ లు, వంటివి కొనుగోలు చేయవచ్చు. ఇవి సాధారణంగా కండోలిం లేదా అంజునా ప్రదేశాలలో దొరుకుతాయి. శనివారాలు సెకండ్ హ్యాం డ్ వస్తువుల మార్కెట్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం లేదా సెలవు దినం అయిందంటే చాలు బీచ్ కు జనాలు అధికంగా వచ్చేస్తారు. కండోలిం ప్రాంతంలోనే మూడు ప్రధాన బీచ్ లు ఉన్నాయి. అవి కండోలిం బీచ్, కాలాగుటే బీచ్ మరియు బాగా బీచ్ లు. వీటిలో బాగా బీచ్ బాగా మెయిన్టెయిన్ చేస్తారు. అన్ని బీచ్ లలోను వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. వీటిని కొంతమంది బ్రోకర్లు నిర్వహిస్తారు. జెట్ స్కైస్, బనానా రైడ్, పారా సైలింగ్ వంటివి ఎంచుకోవచ్చు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more