By: Oneindia Telugu Video Team
Published : February 06, 2018, 06:51

సల్వార్ కమీజ్ లో దేవత, వాట్సాప్ లో ట్రోల్

Subscribe to Oneindia Telugu

తమిళనాడు లోని మయిలాడుతురై యొక్క మయూరనాథస్వామి ఆలయం లో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. డానికి సంభదించిన ఒక వాట్సాప్ ఫోటో ట్రోల్ అయిన తరువాత ఆ ఆలయ పూజారిని సేవల నుండి తొలగించారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే రాజ్ అనే వ్యక్తి 6 నెలల క్రితం తన తండ్రికి సహాయం చేసేందుకు మయూరనాథస్వామి ఆలయం లో పనికి కుదిరాడు, అతని తండ్రి పూజారి.
కాగా ఆ గుడిలోని దేవత పేరు అభయంబల్. దేవాలయానికి చెందిన దేవత అభయంబల్ ని అలంకరించే నేపధ్యంలో చీరతో కాకుండా ఉత్తరప్రదేశ్కు చెందిన సాంప్రదాయ దుస్తులయిన సల్వార్ కమీజ్ తో అభయంబల్ దేవతని అలంకరించాడు రాజ్.
అయితే అది చూసిన భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. 1000 ఏళ్ల విగ్రహం యొక్క "పవిత్రత" అటువంటి ప్రదర్శన కారణంగా పోయిందని అతనితో ఘర్షణ పడ్డారు.
ఇక ఈ విషయమై ఆలయ నిర్వాహకుడు గణేశన్ మాట్లాడుతూ ఆలయం అధికారులు తక్షణమే అతని మరియు అతని తండ్రిని తొలగించాలని నిర్ణయించుకున్నారు అని చెప్పారు. అలాగే శుక్రవారం శుక్రవారం అభయంబల్ దేవత గంధము తో అలంకరించబడుతుంది అని కానీ ఈ సారి సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళుతూ, రాజ్ సల్వార్-కమీజ్-దుపట్టాలో దేవత ని చూపించాలని నిర్ణయించుకున్నాడు అని గణేశన్ వివరించారు. అయితే వాళ్ళు తమ "పొరపాటు" గ్రహించకుండా, తిరిగి దేవత ఫోటోను వాట్సాప్ లో షేర్ చెయ్యడంతో గొడవ ఇంకా పెద్దది అయిందని వివరించారు.
కాగా రాజ్ ఒక పింక్ కమీజ్ మరియు నీలం సల్వార్ అలాగే నీలం దుపట్టతో అభయంబల్ దేవతని అలంకరించాడు. అయితే, ఆలయ పూజారులు అలాంటి నిర్ణయాలు తీసుకోవటం సాధారణం గా మారిపోయింది. గత ఏడాది జనవరిలో, కోయంబత్తూరు జిల్లాలోని ఒక చిన్న ఆలయం లో కొత్త 2000 ల నోట్ల తో దేవతని అలంకరించిన విషయం తెలిసిందే.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా