By: Oneindia Telugu Video Team
Published : October 25, 2017, 05:02

ఇప్పటికి ధోనినే మా కెప్టెన్‌

Subscribe to Oneindia Telugu

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలో కెప్టెన్సీ లక్షణాలు పుష్కలం. కెప్టెన్సీకి వీడ్కోలు పలికినప్పటికీ, ఇప్పటికీ మైదానంలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి విలువైన సూచనలు చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా స్పిన్నర్లకు వికెట్ల వెనుక నిల్చుని బంతులు ఎలా వేయాలో సూచిస్తుంటాడు.
కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్నప్పటికీ ఇప్పటికీ మా కెప్టెన్‌ ధోనియేనని తాజాగా ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ 'ఇప్పటికీ మా కెప్టెన్‌ ధోనినే. ఎందుకుంటే మైదానంలో కొన్నిసార్లు కోహ్లీ మాకు అందుబాటులో ఉండడు. మిడ్‌ ఆన్‌ లేదా లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ ఉంటాడు' అని అన్నాడు.
అలాంటి సమయంలో మమ్మల్ని ఎవరు గైడ్‌ చేస్తారు. కోహ్లీకి దూరంలో ఉంటాడు కాబట్టి కుదరదు. ఇటువంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్‌ మార్చమని ఎవరితో చర్చించాలి. అలాంటి సమయంలో వికెట్ల వెనుకన ఉన్నా ధోని మాకు కనిపిస్తాడు' అని చాహల్‌ తెలిపాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా