By: Oneindia Telugu Video Team
Published : November 10, 2017, 07:11

GSTతగ్గినవి ఇవే : కానీ వాటిమీద తగ్గలేదు !

Subscribe to Oneindia Telugu


గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వినియోగదారులపై వరాల జల్లు కురిపించింది. జిఎస్టీ కౌన్నిల్ సమావేశంలో ఎక్కువ మొత్తంలో ఉపయోగించే వస్తువులపై పన్నులను తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నారు.రూ. 28 వేల కోట్లను వదులుకొనేందుకు కేంద్రం సిద్దమైంది. అదే సమయంలో 28 శాతం పన్ను పరిధిలో కేవలం 50 వస్తువులు మాత్రమే చేర్చారు.
జిఎస్టీ కౌన్సిల్ శుక్రవారం నాడు గౌహతిలో జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొన్నారు. జిఎస్టీ అమలైన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఆయా రాష్ట్రాల వినతుల మేరకు జిఎస్టీ కౌన్సిల్‌లో చర్చించారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జిఎస్టీ ఎఫెక్ట్ ప్రభావం ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకొందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఇప్పటి వరకు 227 వస్తువులపై 28శాతం పన్ను రేటు ఉంది.అయితే 28 శాతం పన్ను పరిధిలోకి కేవలం 50 వస్తువులను మాత్రమే చేర్చారు. ఇప్పటివరకు 28 శాతం పన్ను పరిధిలో ఉన్న 173 వస్తువులను 18 శాతం స్లాబ్‌లోకి మార్చారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా