By : Oneindia Telugu Video Team
Published : December 07, 2017, 02:55

నేను ప్రధాని మోడీ ని కాదు, మనిషిని !

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం గురువారం ముగుస్తోంది. 182 స్థానాలకు గానూ 89 సీట్లకు ఈ నెల 9న ఎన్నికలు జరుగుతాయి. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 977 మంది బరిలో ఉన్నారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఎక్కువ సీట్లు సంపాదించడం అన్ని పార్టీలకు ముఖ్యం.
గుజరాత్ శాసన సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రధాని మోడీ మీద కాంగ్రెస్ పార్టీ యువరాజు వ్యంగ్రాస్త్రాలు సంధింస్తున్నారు.
నేను నరేంద్ర మోడీ బాయ్ కాదు, మనిషిని. మనుషులు తప్పులు చేస్తుంటారు. అందుకే జీవితం ఆసక్తిగా మారుతుంది అంటూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ బాయ్ తప్పు చెయ్యనట్లు వ్యవహరిస్తారని రాహుల్ గాంధీ వ్యంగంగా అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా