By: Oneindia Telugu Video Team
Published : November 18, 2017, 05:14

మోడీ మైండ్ గేమ్: కాంగ్రెస్ రెబల్స్ కు సీట్లు

Subscribe to Oneindia Telugu

గుజరాత్ 2017 శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం 70 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ పటీదార్, బీసీలను ఆకర్షించింది. ఎన్నడూ లేని విధంగా పటీదార్, బీసీలకు టిక్కెట్ల పంపిణిలో ప్రధాన్యం కల్పించారు. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ జితూ వాఘానీలతో సహా ఐదు మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటి జాబితాలో బీజేపీకి చెందిన 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించారు.
ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ సారి ఎన్నికల్లో పోటీ చెయ్యడాని బీజేపీ అధిష్టానం నిరాకరించింది. గుజరాత్ లో తొలి దశలో డిసెంబర్ 9వ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో 89 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇటీవల పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి బరాండకు భిలోడా శాసన సభ నియోజక వర్గం (ఎస్టీ) నుంచి పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించారు.
పటీదార్ వర్గాలకు 15 సీట్లు, బీసీలకు 26 సీట్లు, ఎస్సీలకు మూడు, ఎస్టీలకు 11 సీట్లు కేటాయించారు. బీసీల్లో ఎక్కువ సీట్లు ఠాకూర్ వర్గానికి కేటాయించామని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న 16 మందికి సీట్లు కేటాయించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా