By : Oneindia Telugu Video Team
Published : December 09, 2017, 01:31

గుజరాత్ ఎన్నికల పోలింగ్ అప్ డేట్ !

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన గుజరాత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 182 స్థానాలకు గానూ.. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాల్లోని 89 స్థానాలకు శనివారం తొలివిడుత పోలింగ్‌ జరుగుతుంది. తొలి విడత ఎన్నికల బరిలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని సహా 977 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 2.11 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 14న మిగిలిన స్థానాలకు రెండో విడతలో పోలింగ్‌ జరగనుంది.
భారత జట్టు క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌కోట్ లోని రావి విద్యాలయ బూత్‌లో ఆయన ఓటు వేశారు. కొత్తగా పెళ్లయిన ఓ జంట తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భరుచ్ బహుమాలి భవనంలో వారు ఓటేశారు. ఇక 11గం.కల్లా 20శాతం పోలింగ్! నమోదు అయినట్టు సమాచారం. ఉదయం 10గం. వరకు 9.77శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ నేత అర్జున్ మొద్వాడియా పోర్బందర్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా