By : Oneindia Telugu Video Team
Published : October 13, 2017, 02:37

గుజరాత్ తీర్పు: ప్రధాని మోదీకి జీవన్మరణ సమస్య

చుట్టూ చీకటి, దారంతా ముళ్లు, అయినా ఆశలన్నీ ఆయన పైనే.. భారమంతా అధినేత భుజాలపైనే. ఆయనే ప్రధాని నరేంద్రమోదీ. తాజాగా గుజరాత్‌, హిమాచల్‌‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు, అటు తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే మోదీ బ్రాండ్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నది. కానీ ప్రధాని మోదీ ఇమేజ్‌ మసకబారుతుండటమే కమలనాథులకు కునుకు లేకుండా చేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీ ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన ఆకర్షణ గల నేతగా గుజరాతీలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు.గత మార్చిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దశలో గోరఖ్ పూర్, వారణాసిల్లో రోడ్ షోల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. తదనుగుణంగా ఆ రెండు రీజియన్లలో గంపగుత్తగా బీజేపీకి ఓట్లు పడ్డాయి. గుజరాత్‌లోనూ ప్రధాని నరేంద్ర మోదీ అదే వ్యూహం అనుసరిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా