By: Oneindia Telugu Video Team
Published : August 26, 2017, 11:13

రేప్ కేసులో దోషి డేరాబాబా కోసం రెచ్చిన అనుచరులు....

Subscribe to Oneindia Telugu

సీబీఐ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు మహిళల రేప్ కేసులో నిందితుడైన వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌‌ను దోషిగా తేల్చింది. 2002లో ఇద్దరు మహిళలను రేప్ చేశాడని గుర్మీత్ పై కేసు నమోదైంది. కాగా, ఆగస్టు 28న గుర్మీత్ బాబాకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. అయితే, ఆయన మద్దతుదారులు లక్షల సంఖ్యలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చారు. ఆయుధాలు, పెట్రోలు, డీజీల్ బాటిళ్లతో ఆందోళన నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా